News

నోట్ల ర‌ద్దుపై మాట్లాడితే భూకంపమే


పెద్దనోట్ల రద్దుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ… రూ.500, రూ.1000 నోట్ల రద్దుపై పార్లమెంట్‌లో సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం భయపడుతోందని వ్యాఖ్యానించారు. నోట్ల ర‌ద్దుపై నేను మాట్లాడితే… భూకంపం వస్తుందన్నారు రాహుల్‌. కరెన్సీ రద్దుపై చర్చ కోసం మేం ఎంత ప్రయత్నించినా ప్రభుత్వం సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంతా తిరుగుతూ ప్రసంగాలు చేస్తున్న ప్రధాని మోదీ… సభకు వచ్చి మాట్లాడమంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. దేశ చరిత్రలోనే నోట్ల రద్దు అతిపెద్ద స్కామ్‌ అని ఆరోపించారు రాహుల్‌గాంధీ.